దిశకు ఇది నిజమైన నివాళి: ప్రముఖ హీరో చిరంజీవి
- దిశ తల్లిదండ్రుల ఆవేదనకు ఊరట లభించినట్టయింది
- మానవ మృగాలకు ఇదో గుణపాఠం
- కేసీఆర్ ప్రభుత్వానికి, సీపీ సజ్జనార్ కు అభినందనలు
దిశ ఘటనలోని నిందితులు ఎన్ కౌంటర్ లో మృతి చెందారన్న వార్తను ఉదయం చూశానని, నిజంగా ఇది సత్వర న్యాయం అని భావించినట్టు చెప్పారు. కామంతో కళ్లు మూసుకుపోయి ఇలాంటి నేరాలు, ఘోరాలు చేసే ఎవరికైనా ఇది కనువిప్పు కలిగించాల్సిందేనని, అకృత్యాలకు పాల్పడే మానవ మృగాలకు ఇదో గుణపాఠం కావాలని, నేరస్థుల వెన్నులో వణుకు పుట్టాలని అన్నారు.