ఘాటెక్కిన ఉల్లి ధరలు.. కర్నూలు మార్కెట్ లో క్వింటాల్ కు రూ.12,510
- రైతు బజార్లలో ఉల్లి విక్రయ కేంద్రాల్లో నిల్వలు నిల్
- ధర ఎంతైనా కొనుగోలు చేయండని ప్రభుత్వం ఆదేశం
- కొనుగోళ్లు జరపడంలో యార్డు అధికారులు, వ్యాపారుల మధ్య పోటాపోటీ
మరోవైపు ప్రజలకు రాయితీపై ఉల్లి సరఫరా చేసేందుకు ఎంత ధరకైనా కొనుగోళ్లు జరపాలని ప్రభుత్వం అధికారులకు సూచించడంతో... మార్కెట్ యార్డు అధికారులు, వ్యాపారులు పోటీ పడి కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో ఉల్లి ధరలకు అమాంతం డిమాండ్ పెరిగి ధరలు నింగినంటుతున్నాయి.