టీటీడీలో ఉద్యోగం ఇప్పిస్తానని బంధువుకే రూ.12 లక్షల టోకరా వేసిన ఘనుడు!
- నాలుగు విడతలుగా రూ. 12 లక్షలు చెల్లించుకున్న బాధితుడు
- డబ్బులు అడిగితే బెదిరింపులు
- పోలీసులకు ఫిర్యాదు
నిజమేనని నమ్మిన శేషగిరిరావు నాలుగు విడతలుగా రూ.12 లక్షలు చెల్లించాడు. అయితే, ఆ తర్వాత ఉద్యోగం గురించి మాట్లాడకపోవడంతో తన డబ్బులు తనకు వెనక్కి ఇవ్వాలని శేషగిరిరావు ఒత్తిడి తీసుకొచ్చాడు. దీంతో విషయం పెద్దమనుషుల వద్దకు చేరింది. అక్కడ 7 లక్షల రూపాయలు ఇస్తానని వేళంగిణి రాజు ఒప్పుకున్నాడు. పెద్ద మనుషుల వద్ద డబ్బులు ఇస్తానని చెప్పినప్పటికీ ఇవ్వకపోగా, తిరిగి బెదిరిస్తుండడంతో శేషగిరిరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.