కోల్ కతా టెస్టులో బంగ్లాదేశ్ ఎదురీత
- ఇషాంత్ కు మూడు వికెట్లు
- 13 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన బంగ్లా
- ఆదుకున్న రహీమ్, మహ్మదుల్లా జోడీ
అయితే మహ్మదుల్లా (39) గాయపడడంతో అతడి స్థానంలో మెహిదీ హసన్ బ్యాటింగ్ కు దిగాడు. రహీమ్ 24 పరుగులతో ఆడుతున్నాడు. బంగ్లా జట్టు ఇంకా 159 పరుగులు వెనుకబడే ఉంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ చేసి 106 పరుగులకు ఆలౌటైంది. ఇషాంత్ 5 వికెట్లతో రాణించాడు. ఆపై టీమిండియా తొలి ఇన్నింగ్స్ ను 9 వికెట్లకు 347 పరుగుల స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.