actress Neha dhupia: మళ్లీ సినిమా అవకాశాల కోసం చూస్తున్నా: నటి నేహా దూపియా

షార్ట్స్‌లో చూడండి
తల్లిని అయ్యాక తనకు సినిమా అవకాశాలు రావటంలేదని నటి నేహా దూపియా వాపోతోంది. కేరీర్ మంచి ఊపుమీదుండగానే మరిన్ని సినిమాలు చేసి ఉండాల్సిందని అంటోంది. 'బీఎఫ్ఎఫ్' షోతో పేరు గాంచిన నేహా దూపియా 2018లో పాపకు జన్మనిచ్చాక సినిమా అవకాశాలు రాలేదని చెపుతోంది. తాను చివరగా నటించిన బాలీవుడ్ చిత్రం ‘తుమ్హారీ సులు’ చిత్రంలో నటనతో అందరినీ ఆకట్టుకోవడమేకాక, అవార్డులను కూడా దక్కించుకుంది.

తాజాగా ఆమె ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ, గర్భవతిగా ఉన్న సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానంది. అప్పటినుంచి తనను పత్రికలు తప్పుగా చిత్రీకరించాయని, అప్పటినుంచి తనకు అవకాశాలు రాలేదని చెప్పింది. ప్రస్తుతం తాను వెబ్ షో కోసం సంప్రదింపులు చేస్తున్నానని తెలిపింది. ప్రసవానంతరం బరువు తగ్గాలని తాను అనుకోవడంలేదంది. అదే ప్రత్యేకతతో మళ్లీ అవకాశాలకోసం ప్రయత్నిస్తానని నేహ పేర్కొంది.
Go Back to Shorts
actress Neha dhupia
Mother hood
lost cinema chances
India
Bollywood

More Telugu News