Nayanathara: మరోసారి వెజిటేరియన్ గా మారిన నయనతార

షార్ట్స్‌లో చూడండి
దక్షిణాదిన అగ్ర నటిగా కొనసాగుతున్న నయనతార మరోసారి వెజిటేరియన్ గా మారింది. ప్రస్తుతం ఆమె 'ముక్తి అమ్మన్' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె కన్యాకుమారి అనే దేవత పాత్రను పోషిస్తోంది. దీంతో, మాంసాహారానికి దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించింది.

గతంలో 'శ్రీరామరాజ్యం' సినిమా షూటింగ్ సమయంలో కూడా ఆమె నాన్ వెజ్ ను ముట్టుకోలేదు. ఆ చిత్రంలో ఆమె సీత పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. వ్యక్తిగతంగా క్రిస్టియన్ అయిన నయనతార... దేవతల సినిమాలను చేసే సమయంలో మాంసాహారానికి దూరంగా ఉండటం గొప్ప విషయమే. ఇలాంటి సినిమాలు చేసే సమయంలో ఆమె చాలా నిష్టగా ఉంటుంది. మరోవైపు, ప్రస్తుతం ఆమె 'దర్బార్' సినిమాలో రజినీకాంత్ సరసన నటిస్తోంది.

Go Back to Shorts
Nayanathara
Tollywood
Vegetarian
Non Veg

More Telugu News