యువ సంచలనం మయాంక్ అగర్వాల్ పై గవాస్కర్ వ్యాఖ్యలు
- విశేషంగా రాణిస్తున్న మయాంక్
- ఆడింది కొన్ని టెస్టులే అంటున్న గవాస్కర్!
- త్వరలోనే అతడి బలహీనతలు ప్రత్యర్థులు పట్టేస్తారని వ్యాఖ్యలు
ఎక్కువ మ్యాచ్ లు ఆడేకొద్దీ అతని ఆటతీరుపై ప్రత్యర్థి జట్లు ఓ అంచనాకు వచ్చి అందుకు అనుగుణంగా వ్యూహాలు రూపొందిస్తాయని తెలిపారు. అప్పటినుంచి మయాంక్ కు కష్టకాలం తప్పదని అన్నారు. ఇప్పటివరకు కెరీర్ లో 8 టెస్టులు మాత్రమే ఆడిన మయాంక్ సగటు చూస్తే మేటి బ్యాట్స్ మెన్ సైతం ఆశ్చర్యపోయేలా ఉంది. 71.5 సగటుతో 858 పరుగులు చేశాడు. వాటిలో రెండు డబుల్ సెంచరీలున్నాయి.