సీఎం జగన్ ను ఇష్టారీతిన విమర్శిస్తే, బాబు కుటుంబం బండారాన్ని బయటపెడతా!: మంత్రి కొడాలి నాని హెచ్చరిక
- చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన మంత్రి
- నలబై ఏళ్లుగా మీ డ్రామాలు చూస్తున్నానంటూ ఎద్దేవా
- ఇసుక, ఇంగ్లీష్, హిందూ తప్ప మాట్లడటానికి మీ వద్ద అంశాలు లేవు
టీడీపీ ఇసుక దీక్ష చేస్తే 23 మంది ఎమ్మెల్యేలకు 9 మందే వచ్చారని, అయినా దీక్ష విజయవంతమైందని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇసుక, ఇంగ్లీష్, హిందూ తప్ప మాట్లడటానికి టీడీపీ వద్ద ఏమీ లేవని చెప్పారు. చంద్రబాబు డ్రామాలు నలబైఏళ్లుగా చూస్తున్నానని విమర్శించారు. దేవినేని, యనమల లాంటి బ్రోకర్లతో మాట్లాడించొద్దని చెపుతూ.. పరుష పదజాలాన్ని వాడారు.