Police: పెట్రోల్ బాటిల్ పట్టుకొని కేసీఆర్ క్యాంప్‌ ఆఫీస్‌ వద్దకు వచ్చి.. కలకలం రేపిన వ్యక్తి

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంప్‌ ఆఫీస్‌ వద్దకు పెట్రోల్‌ బాటిల్‌తో వచ్చిన ఓ వ్యక్తి అలజడి రేపాడు. తనకు మంచిర్యాలలో కేబుల్‌ నెట్‌వర్క్‌ ఉందని, అయితే, దాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించారని తెలిపాడు. దీనిపై తాను ఇప్పటికే ఎంపీ,ఎమ్మెల్యేలకు కూడా ఫిర్యాదు చేశానని, అయినప్పటికీ పట్టించుకోవడం లేదని వాపోయాడు.

తాను సీఎం కేసీఆర్ క్యాంప్‌ కార్యాలయం వద్ద ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఇందుకోసం తాను పెట్రోల్‌ బాటిల్‌ను కూడా తెచ్చుకున్నానని అన్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని, అతడిని అరెస్టు చేశారు. అతడి పేరు  రవీందర్‌ అని గుర్తించారు.  
Go Back to Shorts
Police
Hyderabad

More Telugu News