ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు

Salaries for outsourcing and contract employees on the first of every month
  • సీఎం రేవంత్‌రెడ్డి హామీ అమలు
  • ఆర్థిక శాఖ ఉద్యోగుల ఖాతాల్లో నగదు జమ
  • ఇకపై 25లోగా జీతాల బిల్లులు సమర్పించాలని ఆదేశాలు
  • ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగుల్లో ఆనందం
రాష్ట్రంలోని ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈ నెల ఒకటో తేదీనే వారి జీతాలను ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. వివిధ ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు జమయ్యాయి.

గతంలో జీతాల చెల్లింపులో ఆలస్యం కావడంతో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌, ఏజెన్సీ సిబ్బందికి కూడా ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు అందేలా సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు ఆర్థిక శాఖ జీతాల చెల్లింపును పూర్తి చేసింది.

ఇకపై ప్రతి నెల 25వ తేదీలోగా జీతాల బిల్లులను ట్రెజరీ, పే అండ్‌ అకౌంట్స్‌ విభాగాలకు పంపాలని, నెలలో చవరి పని దినానికల్లా ఆడిట్‌ ప్రక్రియ పూర్తి చేయాలని ఆర్థిక శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Revanth Reddy
Telangana Government
Outsourcing Employees Salaries
Contract Employees Salaries
Telangana Salary Update
Finance Department Telangana

More Telugu News