వైభవ్‌కు మరోసారి నిరాశ.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
- చెస్టర్-లీ-స్ట్రీట్‌లో భారత్-ఇంగ్లండ్ తొలి టీ20
- జట్టులోకి వరుణ్ చక్రవర్తి
- ఇంగ్లండ్ జట్టుకు హ్యారీ బ్రూక్ నాయకత్వం
కాలి బొటనవేలి గాయం నుంచి కోలుకున్న స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి జట్టులోకి తిరిగి వచ్చాడు. ఐర్లాండ్ సిరీస్‌కు దూరమైన వరుణ్‌కు ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ లభించింది. మరోవైపు ఇంగ్లండ్ జట్టుకు హ్యారీ బ్రూక్ నాయకత్వం వహిస్తున్నాడు.
భారత జట్టు: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, శివమ్ దూబే, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లండ్ జట్టు: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జేకబ్ బెతెల్, టామ్ బాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, సాకిబ్ మహ్మూద్, ఆదిల్ రషీద్, ల్యూక్ వుడ్.