రూ.15 ఆర్డర్‌కు రూ.500 టిప్.. డెలివరీ బాయ్ కళ్లలో వెలకట్టలేని ఆనందం!

Rs 15 order for Rs 500 tip Priceless joy in delivery boy eyes
  • అది 2 రోజుల సంపాదనతో సమానమన్న డెలివరీ బాయ్‌
  • తన రోజు సంతోషంతో నిండిపోయిందని భావోద్వేగం
  • మహిళ ఔదార్యానికి నెటిజన్లు ప్రశంస
  • డెలివరీ సిబ్బందిని ప్రోత్సహించాలని పలువురి సూచన
కొన్నిసార్లు చిన్న సాయం.. ఎదుటివారి జీవితంలో పెద్ద ఆనందాన్ని నింపుతుంది. కేవలం రూ.15 విలువైన ఆర్డర్‌ను డెలివరీ చేసిన ఓ యువకుడికి, కస్టమర్ ఇచ్చిన రూ.500 టిప్ అతడి ముఖంలో చిరునవ్వు నింపింది. దాదాపు రెండు రోజుల సంపాదనతో సమానమైన ఆ మొత్తం అందుకున్న డెలివరీ బాయ్ భావోద్వేగానికి గురైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వేలాది మంది మనసులను తాకుతోంది.

బ్లింకిట్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు తనకు ఎదురైన మధుర అనుభవాన్ని ఇన్‌స్టాలో పంచుకున్నాడు. కేవలం రూ.15 విలువైన ఆర్డర్‌ను డెలివరీ చేసిన తర్వాత ఆర్డర్ తీసుకున్న మహిళ అతడికి టిప్‌గా రూ.500 నోటు ఇచ్చిందని తెలిపాడు.

వీడియోలో ముందుగా తన ఆరోజు సంపాదనను చూపించాడు. యాప్‌లో తన ఆదాయం కేవలం రూ.97 మాత్రమే కనిపించింది. అనంతరం మహిళ ఇచ్చిన రూ.500 నోటును చూపిస్తూ సాధారణంగా అంత మొత్తం సంపాదించాలంటే తనకు దాదాపు రెండు రోజులు పడుతుందని చెప్పాడు. ఆ మహిళకు పలుమార్లు కృతజ్ఞతలు తెలుపుతూ ఆ చిన్న సాయం తను రోజును సంతోషంగా మార్చేసిందని భావోద్వేగంగా చెప్పాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళ ఔదార్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. డెలివరీ సిబ్బంది ఎండా, వానా కష్టపడి పనిచేస్తుంటారని, ఇలాంటి చిన్న చిన్న ప్రోత్సాహాలు వారికి ఎంతో ధైర్యాన్ని ఇస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
https://www.instagram.com/reel/DaK804UzhMq/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==
Blinkit Delivery Boy
Viral Video
Customer Tip
Social Media Trends
Delivery Partner Story
Heartwarming News

More Telugu News