డేకేర్‌లో అమానుషం: పిల్లలు ఏడిస్తే బాత్రూమ్‌లో బంధించి.. నోట్లోకి టాయిలెట్ జెట్ స్ప్రేతో నీళ్లు!
- బెంగళూరు డేకేర్‌లో చిన్నారులపై అమానుష శిక్షలు
- వాషింగ్ మెషీన్‌లో కూర్చోబెట్టినట్లు ఆరోపణలు
- ఐదుగురు మహిళా సంరక్షకులపై పోలీసులు కేసు నమోదు
- ఘటనపై బాలల హక్కుల కమిషన్ విచారణ
ఈ ఘటన నగరంలోని క్యాప్‌జెమినీ సంస్థ హెచ్‌ఏఎల్ క్యాంపస్‌లో నిర్వహిస్తున్న డేకేర్ కేంద్రంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారులను భయపెట్టి మౌనంగా ఉంచేందుకే ఇలాంటి అమానుష చర్యలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
డేకేర్‌లో పనిచేస్తున్న ఐదుగురు మహిళా సంరక్షకులపై కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు కూడా ఫిర్యాదు అందింది. కార్పొరేట్ కార్యాలయాల్లో నడుస్తున్న డేకేర్ కేంద్రాల భద్రత, పర్యవేక్షణపై ఈ ఘటన తీవ్ర ఆందోళనకు దారితీసింది.