రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో, అచ్చెన్నాయుడు విజయవాడలో ఉండటానికి కారణం ఇదే: కొడాలి నాని
- ఇంగ్లీష్ మీడియంపై కొందరు రాద్ధాంతం చేస్తున్నారు
- ఇంగ్లీష్ రాకపోవడం వల్లే అచ్చెన్నాయుడు విజయవాడలో తిరుగుతున్నారు
- తెలుగు భాషను నిర్లక్ష్యం చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం కాదు
నేటి తరం పిల్లలకు ముఖ్యమంత్రి జగన్ మేనమామ వంటివారని కొడాలి నాని అన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మారుస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 45 వేల పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 33 వేల కోట్లను కేటాయించామని తెలిపారు. అందరికీ ఇంగ్లీష్ మీడియంలో విద్య అందుబాటులోకి రావాలనేదే ప్రభుత్వ ఆకాంక్ష అని... తెలుగు భాషను నిర్లక్ష్యం చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం కాదని చెప్పారు.