ఇప్పటికీ టీడీపీ నాయకుల ఇళ్లల్లో ఇసుక గుట్టలు ఉన్నాయి: వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి
- టీడీపీ హయాంలో ఇసుక విధానం అవినీతి మయం
- బాబు హయాంలో అవినీతిని సీఎం జగన్ కడిగేస్తున్నారు
- పారదర్శక విధానంలో ఇసుక సరఫరా చేస్తాం
ఇటీవల జరిగిన ఒక డిబేట్ లో ఛాలెంజ్ చేస్తే ‘ఏపీ 24x7’ విలేకరులను తీసుకెళ్లి తెలుగుదేశం సానుభూతిపరులు, నాయకుల ఇళ్లల్లో ఉన్న ఇసుక గుట్టలన్నింటినీ చూపించాం’ అని అన్నారు. చంద్రబాబు హయాంలో ఉన్న అవినీతి కంపును వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక కడిగేసి, పారదర్శక విధానంలో ఇసుకను సరఫరా చేయాలన్న ఆలోచనతో ముందుకెళ్తుంటే విమర్శిస్తారా? అని ధ్వజమెత్తారు.