Pawan Kalyan: ఇసుక దీక్ష నేపథ్యంలో.. పవన్ కల్యాణ్ తో టీడీపీ నేతల భేటీ!

షార్ట్స్‌లో చూడండి
ఏపీలో ఇసుక తుపాను రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు రేపు 12 గంటల పాటు 'ఇసుక దీక్ష'ను చేపట్టనున్నారు. విజయవాడలోని ధర్నా చౌక్ లో రేపు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. ఈ నేపథ్యంలో, విజయవాడలోని పవన్ కల్యాణ్ నివాసానికి టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య వెళ్లారు. చంద్రబాబు దీక్షకు మద్దతు తెలపాల్సిందిగా ఈ సందర్భంగా కోరారు. ప్రస్తుతం వీరి భేటీ కొనసాగుతోంది.

మరోవైపు, విశాఖలో ఇటీవల పవన్ కల్యాణ్ చేపట్టిన లాంగ్ మార్చ్ కు టీడీపీ సంఘీభావం ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, స్వయంగా టీడీపీ నేతలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబు దీక్షపై పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
Go Back to Shorts
Pawan Kalyan
Janasena
Chandrababu
Telugudesam
Isuka Deeksha

More Telugu News