Chandrababu: హైదరాబాద్ ఓఆర్ఆర్ ను కూడా తానే నిర్మించానని ఇప్పుడు కోతలు కోస్తున్నాడు: విజయసాయి రెడ్డి

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ మొత్తాన్ని తానే నిర్మించానంటూ ఆయన అంటున్నారని ఆరోపించారు. గతంలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరిపారని విమర్శలు గుప్పించారు.

'హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును అడ్డుకోవడానికి అనేక మందితో కేసులు వేయించి భూసేకరణను అడ్డుకున్నాడు. కోర్టులతో పోరాడి 90 శాతం పూర్తి చేశారు స్వర్గీయ వైఎస్సార్. 430 ఏళ్ల హైదరాబాద్ తో పాటు ఓఆర్ఆర్ ను తానే నిర్మించానని ఇప్పుడు కోతలు కోస్తున్నాడు' అని ఆయన ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Chandrababu
Vijay Sai Reddy
Telugudesam
YSRCP

More Telugu News