ఆ చిత్రంలో నటించి తప్పు చేశా: నయనతార
- ‘గజనీ’ చిత్రంలో నటించినందుకు పశ్చాత్తాపం
- ఆ సినిమాలో తన పాత్రపై అంచనా తప్పిందన్న నయనతార
- ఆసిన్ పాత్ర తో సమానంగా తన పాత్ర లేదని అసంతృప్తి
‘ఈ సినిమాలో నా పాత్ర, ఆసిన్ నటించిన ‘కల్పన’ పాత్రతో సమానంగా ఉంటుందని అనుకున్నాను కానీ, అలా లేదు’ అని నయనతార ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సినిమాలో హీరోగా సూర్య, హీరోయిన్ గా అసిన్ నటించారు. ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్టయింది.
ఇక నయనతార ఇటీవల విడుదలైన ‘సైరా నరసింహారెడ్డి’లో నటించారు. ఈ సినిమాతో ఆమె మంచి విజయాన్ని అందుకున్నారు. తాజాగా ఆమె దర్బార్ చిత్రంలో హీరోయిన్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటిస్తున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.