అంచనాలు పెంచుతున్న 'రాగల 24 గంటల్లో' ట్రైలర్
- ప్రధాన పాత్రధారిగా ఈషా రెబ్బా
- మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే కథ
- త్వరలో ప్రేక్షకుల ముందుకు
ప్రధాన పాత్రలన్నింటినీ కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. కొత్తగా పెళ్లి చేసుకున్న ఒక జంట కొత్త ఇంట్లోకి అడుగుపెట్టడం .. అక్కడ ఆ భర్త హత్య జరగడం .. పోలీసుల విచారణ .. తన భర్తను తనే చంపేశానని ఆ భార్య అంగీకరించడం ఈ ట్రైలర్లో చూపించారు. ఆమె చెప్పేది నిజమేనా? అందుకు కారణాలేమై ఉంటాయి? అనే ఆసక్తిని రేకెత్తిస్తూ ముగించారు. ఈ ట్రైలర్ తో అంచనాలు పెంచడంలో ఈ సినిమా టీమ్ సక్సెస్ అయిందనే చెప్పాలి.