ఇసుక కొరతపై జగన్ స్పందన
- 90 రోజులుగా ఊహించని విధంగా వరద వస్తోంది
- 265 రీచ్ లలో 61 మాత్రమే పని చేస్తున్నాయి
- టీడీపీ పాలనలో ఇసుక మాఫియా నడిచింది
ఇసుక కోసం లారీలు, ట్రాక్టర్లు వెళ్లలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. గత టీడీపీ పాలనలో ఇసుక మాఫియా నడిచిందని... ఇసుక ఉచితం అని చెప్పి మాఫియాను నడిపించారని ఆరోపించారు. ఈ నెలాఖరులోగా ఇసుక సమస్య తీరుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. ఇసుక సమస్య తాత్కాలికమేనని అన్నారు. ప్రజలకు మేలు చేసేలా మార్గదర్శకాలను రూపొందించామని చెప్పారు.