టీటీడీలో డాలర్ శేషాద్రి సేఫ్.. వందమంది అవుట్!
- అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందికి ఉద్వాసన
- ప్రభుత్వ ఆదేశాలు డాలర్ శేషాద్రికి వర్తించవని ఆలస్యంగా గుర్తించిన అధికారులు
- నేటి సాయంత్రానికి పూర్తి వివరాలు
ఉద్వాసనకు గురైన వారి పూర్తి వివరాలు నేడు వెల్లడికానున్నాయి. నిజానికి డాలర్ శేషాద్రి తొలగింపునకు సంబంధించిన ఉత్తర్వులు ఇప్పటికే సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే, రాష్ట్రప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఆదేశాలు ఆయనకు వర్తించే అవకాశం లేదని అధికారులు ఆలస్యంగా గుర్తించడంతో వాటిని పక్కన పెట్టేశారు. ఈ నేపథ్యంలో డాలర్ శేషాద్రి కొనసాగింపు తథ్యమని తెలుస్తోంది.