ట్వీట్‌తో వేడి పుట్టించిన పూనమ్ కౌర్.. మండిపడుతున్న పవన్ అభిమానులు
- ఒక అబద్ధాలకోరు రాజకీయ నాయకుడు కావచ్చేమో
- లీడర్ మాత్రం ఎప్పటికీ కాలేడు
- ఎవరి పేరును ప్రస్తావించకుండా పూనం ట్వీట్
'ఒక అబద్ధాలకోరు రాజకీయ నాయకుడు కావచ్చేమో కానీ... లీడర్ మాత్రం ఎప్పటికీ కాలేడు' అంటూ ఆమె ట్వీట్ చేసింది. అయితే, ఎవరిని ఉద్దేశిస్తూ ఆ ట్వీట్ చేసిందో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఎవరి పేరునూ ఆమె ప్రస్తావించకపోయినప్పటికీ... పవన్ ను ఉద్దేశించే ఆమె ఈ వ్యాఖ్యలు చేసి ఉంటుందని ఆయన అభిమానులు మండిపడుతున్నారు. ఈ ట్వీట్ రానున్న రోజుల్లో ఎంత దుమారం రేపుతుందో వేచి చూడాలి.