వైసీపీ వేధిస్తోందని చెప్పి.. మళ్లీ ఆ పార్టీలోకే ఎందుకు వెళ్తారు?: వంశీ రాజీనామాపై బోండా ఉమ స్పందన
- సంప్రదాయ ఫార్మాట్ లో లేఖ ఇవ్వాలి
- వాట్సాప్ ద్వారా పంపే మెసేజ్ లు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావు
- వంశీ మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా
మూడు రోజుల వ్యవధిలోనే చంద్రబాబు, జగన్, సుజనా చౌదరిలను వంశీ కలిశారని... ఆయన పనులను జనాలు కూడా తప్పుపడుతున్నారని బోండా ఉమ అన్నారు. వంశీతో మాట్లాడాలంటూ కేశినేని నాని, కొనకళ్ల నారాయణరావులను చంద్రబాబు ఆదేశించారని చెప్పారు. గందరగోళ పరిస్థితులకు వంశీ ముగింపు పలకాలని తాను కోరుకుంటున్నానని... ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నానని తెలిపారు.