సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • హన్సికకు దీపావళికి భారీ గిఫ్ట్ 
  • కొరటాల దర్శకత్వంలో చరణ్ 
  • ప్రభాస్ సినిమా కోసం భారీ సెట్స్
*  కథానాయిక హన్సిక ఈ దీపావళికి ఖరీదైన రోల్స్ రాయిస్ కారును గిఫ్టుగా అందుకుంది. విశేషం ఏమిటంటే, వాళ్ల అమ్మ మోనా ఈ కానుకను కూతురికి ఇవ్వడం జరిగింది.  
*  ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో నటిస్తున్న రామ్ చరణ్ తన తదుపరి చిత్ర దర్శకుడి పేరును ప్రకటించాడు. ఆ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తారని చరణ్ చెప్పాడు. మరోపక్క, ప్రస్తుతం చిరంజీవితో కొరటాల శివ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి విదితమే.
*  ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ 'జాన్' చిత్రాన్ని చేస్తున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూళ్ళను పూర్తిచేసుకున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ వచ్చే నెలలో మొదలవుతుంది. ఇందుకోసం ప్రస్తుతం హైదరాబాదులో భారీ సెట్స్ వేస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.
Go Back to Shorts
Hansika
Ram Charan
Koratala Shiva
Prabhas

More Telugu News