‘మా’ సమావేశం ఫ్రెండ్లీగా జరిగింది.. చక్కగా మాట్లాడుకున్నాం: ‘కరాటే’ కల్యాణి

  • ‘మా’లో ఎటువంటి విభేదాలు లేవు
  • ‘మా’ అధ్యక్షుడు బిజీగా ఉండటం వల్లే హాజరు కాలేదు
  • నరేశ్, జీవితా రాజశేఖర్ మధ్య విభేదాలు ఉంటే వాళ్లే చూసుకుంటారు
ఈరోజు నిర్వహించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సర్వసభ్య సమావేశంలో గందరగోళం నెలకొన్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ‘మా’ సభ్యుడు పృథ్వీరాజ్ విమర్శలు చేశారు. అయితే, ఈ సమావేశంలో పాల్గొన్న మరో సభ్యురాలు కరాటే కల్యాణి మాత్రం ‘మా’లో ఎటువంటి విభేదాలు లేవని అన్నారు. ఈ సందర్భంగా ఆమెను పలకరించిన మీడియాతో మాట్లాడుతూ, ‘అందరమూ చక్కగా కలుసుకున్నామని, పరస్పర కుశల ప్రశ్నలు వేసుకున్నామని, భోజనం చేశామని చెప్పారు. ‘మా’ అధ్యక్షుడు నరేశ్ బిజీగా ఉండటం వల్లే ఈ సమావేశానికి హాజరుకాలేదని, ‘నెక్స్ట్ మీటింగ్ కు వస్తారు’ అని అన్నారు. ‘మా’ అధ్యక్షుడు నరేశ్, జనరల్ సెక్రటరీ జీవితా రాజశేఖర్ మధ్య ఏమైనా విభేదాలు కనుక ఉంటే వాళ్లే చూసుకుంటారని అన్నారు.
Go Back to Shorts
MAA
Hyderabad
Karate Kalyan
Naresh
Jeevitha

More Telugu News