Andhra Pradesh: ఏపీలో నిరుద్యోగుల కోసం అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు

షార్ట్స్‌లో చూడండి
ఏపీ సర్కారు నిరుద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకంగా అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. కంపెనీల చట్టం 2013 సెక్షన్ 8 అనుసరించి ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా కన్సల్టెన్సీ, హౌస్ కీపింగ్, సెక్యూరిటీ తదితర రంగాల్లో ఈ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగాల కల్పన చేపట్టనున్నారు.

 కాగా, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అవకాశం కల్పించాలని గత వారమే నిర్ణయించారు. ఇక, నూతనంగా ఏర్పాటైన ఈ కార్పొరేషన్ కు అనుబంధంగా జిల్లాస్థాయిలో విభాగాలు ఉంటాయి. జిల్లా ఇన్ చార్జ్ మంత్రి పర్యవేక్షణలో కార్యకలాపాలు నిర్వహించనున్నారు. ఇందులో జిల్లా కలెక్టర్ తన హోదా ప్రకారం ఎక్స్ అఫిషియో మెంబర్ గా ఉంటారు.
Go Back to Shorts
Andhra Pradesh
Out Sourcing Corporation

More Telugu News