పోలీసులను కించపర్చిన వాళ్లిద్దరిపైనా ఎందుకు మీసాలు తిప్పలేదు?: పోలీసు అధికార్లకు వర్ల రామయ్య ప్రశ్న
- పోలీస్ అధికారుల సంఘం నేత శ్రీనివాస్ పై వర్ల ఫైర్
- మీసాలు తిప్పడం, తొడలు కొట్టడమేంటో!
- ఏపీ డీజీపీ సవాంగ్ కు ఫిర్యాదు చేస్తా
పోలీస్ అధికారుల సంఘం నేత శ్రీనివాస్ చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మీసాలు తిప్పడం, తొడలు కొట్టడం, సవాళ్లు విసరడం ఏంటో అర్థం కావట్లేదని అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గురించి ఆయన ప్రస్తావించారు. పోలీసులను కించపరిచిన ఈ ఇద్దరిపై మీసం ఎందుకు తిప్పలేదు? అగ్రవర్ణాలకు చెందిన ‘పెద్ద రెడ్లు’ అని నోరు మెదపలేదా? అని శ్రీనివాస్ ను ప్రశ్నించారు. శ్రీనివాస్ పై ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.