వెయిటింగ్ లో ఉన్న ఆరుగురు ఏఎస్పీలకు పోస్టింగ్ ఇచ్చిన ఏపీ సర్కారు

షార్ట్స్‌లో చూడండి
గత కొన్నిరోజులుగా ఏపీలో ఉన్నతాధికారుల బదిలీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా, వెయిటింగ్ లో ఉన్న ఆరుగురు ఏఎస్పీలకు పోస్టింగ్ ఇస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. నెల్లూరు క్రైమ్ ఏఎస్పీగా పి.మనోహర్ రావు, ఏపీ పోలీస్ అకాడమీ (అప్పా) ఏఎస్పీగా టి.శోభామంజరి, అనంతపురం అడ్మినిస్ట్రేషన్ ఏఎస్పీగా జి.రామాంజనేయులు, సీఐడీ ఏఎస్పీగా ఎన్.వెంకటేశ్వరరావు, గుంటూరు అర్బన్ క్రైమ్ ఏఎస్పీగా ఎం.శ్రీనివాస్, ప్రకాశం జిల్లా అడ్మినిస్ట్రేషన్ విభాగం ఏఎస్పీగా బి.శరత్ బాబును నియమించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Police
ASP

More Telugu News