'సరిలేరు నీకెవ్వరు'లో మెరవనున్న పూజా హెగ్డే?
- పూజా హెగ్డేకి వరుస విజయాలు
- యూత్ లో పెరుగుతోన్న క్రేజ్
- వెతుక్కుంటూ వస్తోన్న అవకాశాలు
మహేశ్ బాబు కథానాయకుడిగా అనిల్ రావిపూడి రూపొందిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా రష్మిక నటిస్తోంది. ఒక ప్రత్యేక గీతం కోసం తమన్నాను తీసుకున్నారు. ఏ సందర్భంలో వస్తుందో తెలియదుగానీ, మరో పాట కోసం పూజా హెగ్డేను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరికాస్త గ్లామర్ టచ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే దర్శక నిర్మాతలు ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. ఆల్రెడీ మహేశ్ బాబుతో కలిసి 'మహర్షి' సినిమాలో పూజా హెగ్డే ఆడిపాడిన సంగతి తెలిసిందే.