Andhra Pradesh: తుగ్లక్ పాలనలో విజన్ ఏంటబ్బా అని ఆశ్చర్యపోయాం!: నారా లోకేశ్

షార్ట్స్‌లో చూడండి
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఫ్రాన్స్ నుంచి ప్రతినిధుల బృందం వచ్చిన విషయమై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు చేశారు. సీఎం జగన్ విజన్ నచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫ్రాన్స్ నుంచి ఒక బృందం వచ్చిందని సొంత మీడియాలో సొంత డబ్బా కొడుతుంటే తుగ్లక్ పాలనలో విజన్ ఏంటబ్బా అని ఆశ్చర్యపోయామని అన్నారు. ఈ విషయమై ఆరా తీసి ఆ సంస్థ గురించి తెలుసుకుంటే అసలు సంగతి బయటపడిందని అన్నారు. ‘ఆ సంస్థలో మన జగన్ గారి భారతి సిమెంట్ ఒక భాగస్వామి. అంటే వచ్చింది జగన్ గారి చుట్టాలే. మరో క్విడ్ ప్రో కో లాంటిదేదో ప్లాన్ చేస్తున్నారన్నమాట. అబ్బో ఏం విజన్!’ అని లోకేశ్ తన వరుస ట్వీట్లలో విమర్శించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Jagan
Telugudesam
Nara Lokesh

More Telugu News