మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా' చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలై అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ రోజు ఈ చిత్రానికి సంబంధించిన రెండవ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ లో యుద్ధ సన్నివేశాలను చూపించారు. ఈ సన్నివేశాల్లో చిరంజీవి నటన అదరహో అనిపించేలా ఉంది. ఇంకా చెప్పాలంటే విశ్వరూపం ప్రదర్శించారు. అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.