టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ విజ్ఞప్తిని తోసిపుచ్చిన న్యాయస్థానం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ విజ్ఞప్తిని తోసిపుచ్చిన న్యాయస్థానం

  • రవిప్రకాశ్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ
  • బెయిల్ నిబంధనలు తొలగించాలంటూ రవిప్రకాశ్ పిటిషన్
  • రవిప్రకాశ్ అభ్యర్థనను తిరస్కరించిన కోర్టు
ఆర్థిక అవకతవకలకు సంబంధించిన కేసులో టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ అభియోగాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. టీవీ9 నూతన యాజమాన్యం చేసిన ఫిర్యాదుల ఆధారంగా ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ తీసుకునేందుకు అడ్డంకిగా ఉన్న కొన్ని నిబంధనలను తొలగించాలంటూ తాజాగా రవిప్రకాశ్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది.

పోలీస్ స్టేషన్ లో వ్యక్తిగతంగా హాజరవకుండా మినహాయింపు ఇవ్వాలని, విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలని తన పిటిషన్ లో రవిప్రకాశ్ అర్థించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు రవిప్రకాశ్ విన్నపాలను తోసిపుచ్చింది.
TV9
Ravi Prakash
High Court

More Telugu News