Nagarjuna: నాగార్జున వ్యవసాయ క్షేత్రంలో కుళ్లిన స్థితిలో మృతదేహం

  • హైదరాబాద్ శివార్లలో నాగార్జునకు 40 ఎకరాల వ్యవసాయ క్షేత్రం
  • భూమిలోని పాడుబడిన గదిలో మృతదేహం
  • అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసిన పోలీసులు
టాలీవుడ్ హీరో నాగార్జున వ్యవసాయ క్షేత్రంలో ఓ వ్యక్తి మృతదేహం కనిపించడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ శివార్లలోని పాపిరెడ్డిగూడ (రంగారెడ్డి జిల్లా)లో నాగార్జునకు 40 ఎకరాల స్థలం ఉంది. ఈ భూమిలోని ఓ పాడుబడిన గదిలో ఓ వ్యక్తి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి, దర్యాప్తును ప్రారంభించారు. మృతుడు ఎవరో గుర్తించే పనిలో పడ్డారు.
Nagarjuna
Land
Dead Body
Tollywood

More Telugu News