శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం.. 110 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం!
- ఒకటో నంబర్ జనరేటర్ లో చెలరేగిన మంటలు
- వెంటనే అప్రమత్తమై ఆర్పేసిన సిబ్బంది
- బ్రేక్ ప్యాడ్స్ మధ్య మంటలు వచ్చినట్లు గుర్తింపు
ఈ విషయమై జలవిద్యుత్ కేంద్రం ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ఒకటో నంబర్ జనరేటర్ లో బ్రేక్ ప్యాడ్స్ మధ్య మంటలు చెలరేగాయని తెలిపారు. ఈ అగ్నిప్రమాదం కారణంగా 110 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయిందని చెప్పారు. ప్రస్తుతం జనరేటర్ ను పునరుద్ధరిస్తున్నామనీ, త్వరలోనే విద్యుత్ ఉత్పత్తిని తిరిగి మొదలుపెడతామని పేర్కొన్నారు.