కోడెల మరణంపై నిజాలన్నీ త్వరలోనే బయటపడతాయి!: ఏపీ మంత్రి ధర్మాన
- కుటుంబ విభేదాల కారణంగానే కోడెల ఆత్మహత్య
- ఈ విషయాన్ని ఆయన మేనల్లుడే చెప్పాడు
- తెలంగాణ సర్కారు సిట్ ఏర్పాటు చేసింది
కోడెల మరణాన్ని కూడా చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం నేత కోడెల నిన్న హైదరాబాద్ లో తన నివాసంలో ఆత్మహత్యకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన బసవతారకం ఆసుపత్రికి తరలించగా, అక్కడే తుదిశ్వాస విడిచారు.