పోలీసుల చేతికి కోడెల పోస్టుమార్టం రిపోర్టు... వెస్ట్ జోన్ డీసీపీ తాజా ప్రకటన

  • కోడెలను ఆయన భార్య, డ్రైవర్ ఆసుపత్రికి తీసుకెళ్లారన్న డీసీపీ
  • ఆసుపత్రికి తీసుకొచ్చేటప్పటికి పల్స్ లేదని వెల్లడి
  • గంట తర్వాత మరణించినట్టు డాక్టర్లు చెప్పారన్న డీసీపీ
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు భౌతికకాయానికి పోస్టుమార్టం నిర్వహించిన ఉస్మానియా వైద్యులు నివేదికను పోలీసులకు అందించారు. కోడెల ఉరేసుకుని చనిపోయినట్టు ప్రాథమికంగా తేల్చారు. దీనిపై వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ, కోడెల ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయినట్టు భావిస్తున్నామని తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడిన కోడెలను ఆయన భార్య, డ్రైవర్ ఆసుపత్రికి తీసుకెళ్లారని వివరించారు. ఆసుపత్రికి తీసుకొచ్చేటప్పటికి పల్స్ లేదని వైద్యులు తెలిపారని చెప్పారు. గంట తర్వాత కోడెల చనిపోయినట్టు వైద్యులు చెప్పారని వెల్లడించారు. తమకున్న ప్రాథమిక ఆధారాలతో ఆయనది ఆత్మహత్యగానే భావిస్తున్నామని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Kodela
Andhra Pradesh
Police

More Telugu News