అఖిల్ తో జత కట్టేందుకు భారీ పారితోషికం డిమాండ్ చేసిన పూజా హెగ్డే?
- బొమ్మరిల్లు' భాస్కర్ తో అఖిల్ మూవీ
- గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మాణం
- త్వరలో షూటింగుకి పూజా హెగ్డే
మరోపక్క, ఈ సినిమాలో కథానాయిక ఎంపిక జరిగిపోయిందంటూ రష్మిక మందన .. కైరా అద్వాని .. నివేదా పేతురాజ్ పేర్లు వినిపించాయి. కానీ అవేవి నిజం కాదనే విషయం రీసెంట్ గా స్పష్టమైపోయింది. తాజాగా తెరపైకి పూజా హెగ్డే పేరు వచ్చింది. కథానాయిక పాత్ర కోసం పూజా హెగ్డేను సంప్రదించగా, ఆమె 3.5 కోట్లను డిమాండ్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఆ మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు అంగీకరించారని అంటున్నారు. త్వరలోనే ఆమె ఈ సినిమా షూటింగులో జాయిన్ కానుందని చెబుతున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.