Chiranjeevi: చిరంజీవిపై ప్రశంసలు కురిపించిన నారా లోకేశ్

షార్ట్స్‌లో చూడండి
మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ నేత నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా చిరంజీవిపై లోకేశ్ ప్రశంసలు కురిపించారు. ఇంటిల్లిపాదికి వినోదాన్ని అందించే విభిన్నమైన పాత్రల్లో చిరంజీవి నటించారని అన్నారు. ప్రేక్షకుల హృదయాలలో ఆయన సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని చెప్పారు. స్వయంకృషి, పట్టుదలతో ఒక సామాన్యుడు అత్యుత శిఖరాలను అధిరోహించవచ్చని చిరంజీవి నిరూపించారని కొనియాడారు. ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని అన్నారు. మరోవైపు జన్మదినం సందర్భంగా చిరంజీవికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
Go Back to Shorts
Chiranjeevi
Nara Lokesh
Telugudesam
Tollywood

More Telugu News