తెలంగాణ సహా ఏడు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఫైన్!
- మానవ హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా కోర్టులు
- అభిప్రాయం తెలపాలని పలుమార్లు కోరిన సుప్రీంకోర్టు
- స్పందించకపోవడంతో ఆగ్రహిస్తూ, జరిమానా
రాష్ట్రాల్లో మానవ హక్కుల ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాల్సిందిగా 2018లోనే అత్యున్నత ధర్మాసనం సూచించింది. ఈ కేసు నిన్న వాదనలకు రాగా, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ బీఆర్ దవైల ధర్మాసనం విచారించింది. రాజస్తాన్. ఉత్తరాఖండ్ ల తరఫున కనీసం న్యాయవాదులు కూడా హాజరు కాకపోవడంతో ఆ రాష్ట్రాలకు లక్ష రూపాయల చొప్పున, మిగతా తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఒడిశా, మేఘాలయ, మిజోరాంలకు రూ.50 వేల చొప్పున జరిమానా విధిస్తున్నట్టు న్యాయమూర్తులు పేర్కొన్నారు. మరో నాలుగు వారాల్లోగా తమ నివేదికలను సమర్పించాలని ఆదేశించారు.