క్లెయిమ్ చేయని ఎల్‌ఐసీ, ఈపీఎఫ్ నిధులు ఇతర అవసరాలకు వాడబోం: కేంద్రం
- ఈ నిధుల వినియోగంపై ఎలాంటి కొత్త ప్రతిపాదన లేదన్న కేంద్రం
- ఈపీఎఫ్‌ఓ నిధుల విషయంలోనూ మార్పు లేదని స్పష్టీకరణ
- ఎల్‌ఐసీలో రూ.7,318.50 కోట్ల క్లెయిమ్ చేయని నిధులు
- ఈపీఎఫ్‌ఓలో రూ.9,330.56 కోట్ల ఇనాపరేటివ్ నిధులు
- లబ్ధిదారులను గుర్తించేందుకు చర్యలు కొనసాగుతున్నాయన్న కేంద్రం
ఎల్‌ఐసీలో క్లెయిమ్ చేయకుండా మిగిలిపోయిన నగదు, ఈపీఎఫ్‌ఓలోని నిర్వీర్య (ఇనాపరేటివ్) ఖాతాల్లో ఉన్న నిధులను ఇతర అవసరాలకు వినియోగించే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారమే ఈ నిధులను నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
2024 జూన్ 19న ఐఆర్‌డీఏఐ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. పదేళ్లకు పైగా క్లెయిమ్ చేయని బీమా మొత్తాలను సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్ (ఎస్‌సీడబ్ల్యూఎఫ్)కు బదిలీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. 2026 మార్చి 31 నాటికి ఎల్‌ఐసీలో మొత్తం రూ.7,318.50 కోట్లు క్లెయిమ్ చేయని నిధులు ఉన్నాయని వెల్లడించారు. ఇందులో పాలసీదారులకు చెందిన రూ.5,564.55 కోట్లు, వాటిపై వచ్చిన ఆదాయం రూ.1,753.95 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు.
అలాగే ఈపీఎఫ్‌ఓలో క్లెయిమ్ చేయని ఖాతాలు ఏవీ లేవని, అయితే లావాదేవీలు లేక నిర్వీర్యంగా మారిన ఖాతాల్లో రూ.9,330.56 కోట్లు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. ఈ నిధుల అసలైన లబ్ధిదారులను గుర్తించి వారికి అందించేందుకు ఎల్‌ఐసీ, ఈపీఎఫ్‌ఓ ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయని వివరించింది.
ఎల్‌ఐసీ తన వెబ్‌సైట్ ద్వారా క్లెయిమ్ చేయని మొత్తాలను తెలుసుకునే అవకాశం కల్పించడంతో పాటు ఎస్‌ఎంఎస్‌లు, లేఖలు, ఏజెంట్లు, బీమా సఖీల ద్వారా పాలసీదారులు, నామినీలను సంప్రదిస్తోందని ప్రభుత్వం తెలిపింది. మరోవైపు ఆధార్‌తో అనుసంధానమైన రూ.1,000లోపు నిర్వీర్య ఈపీఎఫ్ ఖాతాలను ఆటోమేటిక్‌గా సెటిల్ చేసే పైలట్ ప్రాజెక్టును కూడా ఈపీఎఫ్‌వో ప్రారంభించినట్లు వెల్లడించింది.