జస్ట్ ఐదేళ్లు.. కశ్మీర్ మరో పాలస్తీనాగా మారిపోతుంది.. ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా హెచ్చరిక!
- ఆర్టికల్ 370ని రద్దుచేసిన కేంద్రం
- రాష్ట్రాన్ని విభజన చేస్తూ నిర్ణయం
- తీవ్రంగా తప్పుపట్టిన ఆర్జేడీ రాజ్యసభ సభ్యుడు
‘ఒకవేళ కశ్మీర్ ప్రజలను అణచివేయాలని భారత్ అనుకుంటే అది భారతీయ ఆత్మకు ఆత్మహత్య సదృశమే’ అని జయప్రకాశ్ నారాయణ్ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. కశ్మీర్ రాష్ట్రం పాలస్తీనాగా మారేందుకు మనం ఓ దారిని తెరిచామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే ఐదేళ్లలో కశ్మీర్ పాలస్తీనాగా మారిపోతుందని హెచ్చరించారు. ఇప్పటికైనా అహాన్ని వీడి, కశ్మీరీలను కలుపుకునిపోవాలని సూచించారు.