భర్త ఫోన్‌లో అమ్మాయిల ఫోన్ నంబర్లు.. నిలదీసినందుకు ఆమె ఫేస్‌బుక్ ఖాతాలో అసభ్య ఫొటోల పోస్టింగ్
- ప్రేమించి పెళ్లాడిన యువకుడు
- మనస్పర్థలతో సొంతూరికి వెళ్లిపోయిన యువకుడు
- నిందితుడికి పోలీసుల అరదండాలు
పెళ్లి తర్వాత భార్య మెయిల్ ఐడీతో యువకుడు ఫేస్‌బుక్ ఖాతా తెరిచాడు. దీనిని ఆమె కూడా తరచూ చూసేది. అయితే, గతేడాది జనవరిలో భర్త వాట్సాప్, ఫేస్‌బుక్ ఖాతాల్లో అమ్మాయిల ఫోన్ నంబర్లు చూసిన బాధితురాలు అతడిని నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగి మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. దీంతో ఉద్యోగం మానేసిన నిందితుడు స్వగ్రామానికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత భార్యపై కోపంతో ఆమెతో సన్నిహితంగా ఉన్న అసభ్యకర చిత్రాలను ఆమె ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేస్తూ, వేధించడం మొదలుపెట్టాడు. దీంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం పోలీసులు మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేశారు.