Bigg Boss-3: బిగ్ బాస్ నన్ను టార్గెట్ చేశాడు... ఎంతో టార్చర్ పెట్టాడు: హేమ

షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ నటి హేమ 'బిగ్ బాస్' షో అనుభవాలపై ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. హేమ కూడా బిగ్ బాస్-3 కంటెస్టెంట్లలో ఒకరు. అయితే ఆమె తొలివారమే ఎలిమినేట్ అవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. ఇక, మీడియా సమావేశంలో హేమ మాట్లాడుతూ, బిగ్ బాస్ షోలో పాల్గొంటున్న అందరికీ మెడికల్ టెస్టులు చేసి రిపోర్టులు పరిశీలించిన తర్వాతే హౌస్ లోకి అనుమతించారని హేమ వెల్లడించారు.

తొలివారం అందరి ఫోకస్ తనపైనే ఉందని చెప్పారు. బిగ్ బాస్ షోకి తాను వెళ్లింది నటించడానికి కాదని, తాను బయట ఎలా ఉంటానో బిగ్ బాస్ ఇంట్లో కూడా అలాగే ఉన్నానని స్పష్టం చేశారు. అయితే బిగ్ బాస్ తనను టార్గెట్ చేశాడని, ఎంతో టార్చర్ పెట్టాడని హేమ పేర్కొన్నారు. కొన్ని విషయాలు ఎడిట్ చేసి బయటికి ప్రసారం చేయలేదని వివరించారు.

హౌస్ లో తాను ఎవరినీ డామినేట్ చేయలేదని, సొంత వ్యక్తిత్వం నిలుపుకునేందుకు ప్రయత్నించానని వివరించారు. బిగ్ బాస్ ఇంట్లో తాను ఎలాంటి పొరపాట్లు చేయలేదని, అయితే కిచెన్ లో ఇతర కంటెస్టెంట్లతో గొడవ జరిగిందని, తాను ఎవరినీ నిందించనని, అదే సమయంలో తిట్టించుకోనని అన్నారు. అక్కడ సరైన సరుకులు కూడా లేవని వెల్లడించారు. అక్కడున్నవాళ్లలో తనకంటే అందరూ చిన్నవాళ్లేనని, కనీసం ఉప్పు, కారాలు ఎలా వాడాలో కూడా వాళ్లకు తెలియదని హేమ వ్యాఖ్యానించారు. 'ఎవరి డైరెక్షనూ నాకు నచ్చదు, అందుకే వాళ్లకు నేను నచ్చలేదు' అంటూ మీడియా ప్రతినిధులకు వివరించారు. 
Go Back to Shorts
Bigg Boss-3
Hema
Tollywood
Nagarjuna

More Telugu News