సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ఆ సినిమా మిస్ అయిందట!
  • అక్కినేని హీరోల మల్టీస్టారర్
  • బిజీ అవుతున్న సీనియర్ నటి  
*  'రంగస్థలం' చిత్రంలో హీరోయిన్ గా ఆఫర్ ముందు తనకే వచ్చిందని చెబుతోంది అనుపమ పరమేశ్వరన్. 'అప్పుడు డేట్స్ సర్దుబాటు చేయలేక ఆ అవకాశాన్ని వదులుకున్నాను. అందుకని ఇప్పటికీ ఫీలవుతుంటాను. అయితే, సినిమా చూశాక సమంత బాగా చేసిందనిపించింది' అని చెప్పింది అనుపమ.
*  'మన్మథుడు 2' సినిమా అవుట్ పుట్ బాగా రావడంతో హ్యాపీగా వున్న అక్కినేని నాగార్జున ఆ చిత్ర దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కి మరో పెద్ద ఆఫర్ ఇచ్చాడట. నాగ చైతన్య, అఖిల్ లతో మల్టీ స్టారర్ చేసే అవకాశాన్ని రవీంద్రన్ కి ఇచ్చినట్టు సమాచారం.
*  నాలుగున్నర దశాబ్దాల నుంచి హీరోయిన్ గా.. క్యారెక్టర్ నటిగా వందలాది చిత్రాలలో నటిస్తూ వస్తున్న సీనియర్ నటి లక్ష్మి ఇటీవల వచ్చిన 'ఓ బేబీ' చిత్రంతో మళ్లీ బిజీ అవుతున్నారు. ఇప్పటికే ఆమె 'మన్మథుడు 2', 'గ్యాంగ్ లీడర్' చిత్రాలలో నటిస్తుండగా.. అంగీకరించవలసిన చిత్రాలు మరికొన్ని వున్నాయట. 
Go Back to Shorts
Anupama
Rangasthalam
Nagarjuna
Akhil
Lakshmi

More Telugu News