నారా లోకేశ్ మంత్రిగా వున్నప్పుడు ఐటీ శాఖలో భారీ అవినీతి జరిగింది.. దీనిపై సీబీఐ విచారణ జరపాలి!: అన్నం సతీష్
- ఈ విషయమై ముఖ్యమంత్రి జగన్ తో మాట్లాడుతా
- ఏపీ ఎన్నికల్లో లోకేశ్ కారణంగానే ఓడిపోయారు
- త్వరలోనే టీడీపీ ఖాళీ అయిపోతుంది
నారా లోకేశ్ అవినీతిపై పూర్తిస్థాయిలో విచారణ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. త్వరలోనే ఏపీలో టీడీపీ ఖాళీ కాబోతోందని జోస్యం చెప్పారు. అర్హత లేకపోయినా పార్టీని నడిపేందుకు లోకేశ్ ప్రయత్నిస్తున్నారనీ, అందుకే టీడీపీ ఓడిపోయిందని గతంలో సతీష్ ఆరోపించారు. అనంతరం టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.