Bangladesh: భారత్ కు కావాల్సింది 2 వికెట్లు... బంగ్లాదేశ్ చేయాల్సింది 18 బంతుల్లో 36 రన్స్!
టీమిండియాతో ఎడ్జ్ బాస్టన్ మైదానం వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ గట్టిగా పోరాడుతోంది. 315 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన బంగ్లా జట్టు 47 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. ఆ జట్టు విజయం సాధించాలంటే 18 బంతుల్లో 36 పరుగులు సాధించాలి. మరోవైపు టీమిండియా విజయానికి మరో 2 వికెట్లు అవసరం. ప్రస్తుతం క్రీజులో సైఫుద్దీన్ (45), రూబెల్ (8) ఆడుతున్నారు.