బంగ్లాదేశ్ ఓపెనర్లిద్దరూ అవుట్ కావడంతో కోహ్లీ సంబరాలు

  • బంగ్లాదేశ్ టార్గెట్315 పరుగులు
  • 18 ఓవర్లలో 88/2
  • చెరో వికెట్ తీసిన షమీ, పాండ్య
బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ మైదానంలో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు బంగ్లాదేశ్ ఓపెనర్లను పెవిలియన్ కు తిప్పిపంపారు. తమీమ్ ఇక్బాల్ (22) ను మహ్మద్ షమీ, సౌమ్య సర్కార్ (33) ను హార్దిక్ పాండ్య అవుట్ చేశారు. ఈ ఇద్దరు బ్యాట్స్ మెన్ కూడా మ్యాచ్ ను మలుపు తిప్పగల సత్తా ఉన్నవాళ్లే. దాంతో ఈ ఇద్దరు అవుట్ కాగానే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ముఖంలో పట్టరాని సంతోషం కనిపించింది. ముఖ్యంగా, పాండ్య విసిరిన షార్ట్ బంతికి సౌమ్య సర్కార్ అవుట్ కాగానే, "నువ్వు అవుట్" అంటూ సంజ్ఞ చేసి కోహ్లీ తన స్పందన వెలిబుచ్చాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 18 ఓవర్లలో 2 వికెట్లకు 88 పరుగులు చేసింది. క్రీజులో ఆల్ రౌండర్ షకీబల్ హసన్ (24) కు తోడుగా ముష్ఫికర్ రహీమ్ (6) ఆడుతున్నాడు. బంగ్లా జట్టు విజయం సాధించాలంటే 32 ఓవర్లలో 227 పరుగులు చేయాలి.
Go Back to Shorts
India
Bangladesh
World Cup
Cricket

More Telugu News