Sharwanand: డాక్టర్ గురువారెడ్డి, డాక్టర్ ఆదర్శ్ లకు ఎప్పటికీ రుణపడి ఉంటాను: హీరో శర్వానంద్

షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ యువహీరో శర్వానంద్ ఇటీవలే థాయ్ లాండ్ లో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. శర్వానంద్ భుజం ఎముక విరగడంతో హైదరాబాద్ లోని సన్ షైన్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిర్వహించారు. డాక్టర్ గురవారెడ్డి ఆధ్వర్యంలో వైద్య నిపుణుల బృందం దాదాపు 11 గంటల పాటు శ్రమించి శర్వా భుజాన్ని పూర్వస్థితికి తీసుకువచ్చారు. ప్రస్తుతం భుజం గాయం నుంచి కోలుకున్న శర్వానంద్ సోషల్ మీడియాలో స్పందించారు. తనను మళ్లీ మామూలు మనిషిని చేసిన డాక్టర్ గురవారెడ్డి, డాక్టర్ ఆదర్శ్ లకు ఎప్పటికీ రుణపడి ఉంటానని ఎమోషనల్ ట్వీట్ చేశాడు. తన కుటుంబ సభ్యులతో పాటు ఆ ఇద్దరు డాక్టర్లతో తీసుకున్న ఫొటోను శర్వా పోస్టు చేశాడు. కష్టకాలంలో తన క్షేమాన్ని కోరుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకుంటన్నట్టు తన పోస్టులో పేర్కొన్నాడు.
Go Back to Shorts
Sharwanand
Tollywood

More Telugu News