విరాట్ కోహ్లీ ఖాతాలో మరో అద్భుతమైన రికార్డు

  • అత్యంత వేగంగా 20,000 పరుగులు
  • 417 ఇన్నింగ్స్ ల్లో కోహ్లీ ఘనత
  • సచిన్, లారా రికార్డు తెరమరుగు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కీర్తికిరీటంలో మరో ఘనత అందంగా ఒదిగిపోయింది. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ లో అత్యంత వేగంగా 20,000 పరుగులు సాధించిన ఆటగాడిగా కోహ్లీ సరికొత్త రికార్డు నమోదు చేశాడు. వెస్టిండీస్ తో వరల్డ్ కప్ మ్యాచ్ లో హోల్డర్ విసిరిన బంతికి సింగిల్ తీయడం ద్వారా కోహ్లీ ఈ ఘనత సాధించాడు. కోహ్లీ కేవలం 417 ఇన్నింగ్స్ ల్లోనే ఈ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా పేరిట ఉంది. సచిన్, లారా ఇద్దరూ 453 ఇన్నింగ్స్ ల్లో ఈ ఘనత అందుకున్నారు.
Go Back to Shorts
Virat Kohli
Sachin Tendulkar
Brian Lara
Cricket
Record

More Telugu News