నేను బీజేపీలో చేరలేదు.. వైసీపీలో చేరబోతున్నా: అంబికా కృష్ణ సోదరుడు రాజా
- నేను బీజేపీలో చేరినట్టు వస్తున్న వదంతులు నమ్మొద్దు
- నా సోదరుడు బీజేపీలో చేరడం ఆయన వ్యక్తిగతం
- దివంగత సీఎం వైఎస్ అంటే నాకు ఎంతో అభిమానం
తన సోదరుడు బీజేపీలో చేరడం ఆయన వ్యక్తిగత వ్యవహారమని, తాను మాత్రం వైసీపీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని సమక్షంలో త్వరలో వైసీపీలో చేరనున్నట్టు చెప్పారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే తనకు ఎంతో అభిమానమని అన్నారు. వైసీపీలో ఎటువంటి పదవి ఆశించకుండా ఆ పార్టీలో తాను చేరబోతున్నట్టు స్పష్టం చేశారు.